16/06/2012

మా నాన్న...



పిల్లల్ని నవమాసాలు మోసిన అమ్మ గొప్పతనం ఒక వైపుంటే,
ఆ సంతానాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే నాన్న గొప్పతనం వేరొకవైపు ఉంది.



మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,
ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా!

దెబ్బ తగిలితే అమ్మా!అంటూ అరుస్తాం...
కాని మందు వేయించేది నాన్నే కదా!



పాకెట్ మనీ కోసం రికమండేషన్ చేసేది అమ్మ  అయితే..
మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా!

చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది...
సమస్య జటిలమైతే పరుగెత్తేది నాన్న వద్దకే కదా!






భూదేవంత ఓర్పు, సహనం  అమ్మదైతే 
ఆకాశమంత   ఔన్నత్యం  నాన్నది.
చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం...
పెద్దయ్యాక కనీసం  ఆ రెక్కల భారాన్ని పంచుకునే 
ప్రయత్నం కూడా చేయం...




కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ  తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....





'అమ్మ' వర్తమానాన్ని చూస్తే...
మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేదీ,
మనకు లక్ష్యాలను  చూపేదీ,
వాటిని సాధించుకొనేందుకు  బంగారు  బాటలు వేసేది  'నాన్నే' కదా!



                             (నేను పురుషుడిని కావటం వలన ఈ కవిత వ్రాయలేదు...
                             నాకు దొరికినట్లుగా మంచి తండ్రిని పొందిన ప్రతి ఆడవారు, మగవారు 
                             నాతొ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను....ఈ నెల 17వ తేదీ "ఫాదర్స్ డే "
                              సందర్భంగా మా నాన్న కోసం వ్రాసిన చిరు  కవిత...@శ్రీ )


43 comments:

  1. చాలా చాలా బాగుంది.. శ్రీగారు...మీ కవిత..

    మీకు Father's day subhakanshalu....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాయీ ....కవిత నచ్చినందుకు,
      మరియు father'sday wish కి.
      @శ్రీ

      Delete
    2. నాన్న ప్రేమను తెలిపే కవిత ఇది

      Delete
  2. Sri Gaaru Yekkadanoo Tech Chesharu andi....

    ela cheppalo kuda maatalu ravatam ledu andi...

    chaalaa chaalaa bagundi andi...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రిన్స్..మీ భావాత్మకమైన స్పందనకు,
      మీకు కవిత నచ్చినందుకు...
      @శ్రీ

      Delete
  3. మీకు కూడా...
    పితృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనికేత్!
      కవిత మీకు నచ్చినందుకు,
      శుభాకాంక్షలు అందించినందుకు....
      @శ్రీ

      Delete
  4. Wishing U Happy Father's Day.

    ReplyDelete
  5. శ్రీగారు, మీ కవిత మనసుని కదిలించింది, అమ్మా ,నాన్నల ప్రేమలో వ్యత్యాసం ఉండదు, కాని కొన్ని వరాలు బాద్యతలు అమ్మకు ప్రకృతి ఇచ్చిన వరాలు అంతే, ఇకపోతే మీ ఆవేదన , ఆప్యాయత చూస్తే మీరు కుడా ఓ మంచి తండ్రి అనుకుంటున్నాను. మీ చల్లని నీడ మీ సంతానానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ .. మీకు పిత్రుదినోత్శవ శుబాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ!
      కవితకి మీరు స్పందించిన తీరుకి ధన్యవాదాలు...
      అభినందనలకి మరోసారి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  6. motham meda amma mundu naannani nilabetti, nuvvu kooda o.k nanna anntludandi naaku, nice one, keep writing, happy fathers day.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ!
      మీరు వ్రాసినది నా కవితా భావం కాదండోయ్...
      ఆలోచించి మరోసారి చదవండి...
      అవన్నీ నిజాలని మీరే అంటారు..:-)
      మీ అభినందనలకి ధన్యవాదాలు మీకు....
      @శ్రీ

      Delete
  7. chaalaa chakkaga amma naannala gurinchi chepparu....
    miku kuda happy fathers day andi

    ReplyDelete
    Replies
    1. నాకు తోచిన భావాలకు అక్షర రూపం ఇచ్చానండీ!
      మీ అభినందనలకు, ప్రశంసకు
      ధన్యవాదాలు మంజు గారూ!
      @శ్రీ

      Delete
  8. అమ్మ నాన్నల గురించి చాలా బాగా వ్రాసారు .
    హాపీ ఫాదర్స్ డే .

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు,
      అభినందనలకి,
      ధన్యవాదాలు మాలా కుమార్ గారూ!
      @శ్రీ

      Delete
  9. శ్రీ గారూ,
    అమ్మా నాన్న పిల్లలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు.
    ఈరోజు నాన్నగారికోసం రాస్తూ ఇద్దరి ప్రేమనీ చాలా చక్కగా మాటల్లో పొందుపరిచారు. ప్రేమని పంచటంలో అమ్మా, నాన్నా ఇద్దరూ ఒకటే. అమ్మ జన్మనిచ్చి నాన్నకన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనే నిలుస్తుంది.
    అందుకే 'మాతృదేవోభవ' తరువాతే 'పితృదేవోభవ'.
    కానీ అమ్మా నాన్నా అన్నీ నాన్నే అయ్యి అమ్మలా చూసుకునే తండ్రులూ ఉన్నారు. ఇలా ఈ నాడు తండ్రి ని గుర్తుచేసుకోవటం ఓ ఆనందమైన అనుభూతి.
    Happy Fathers Day to You!

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణ చాలా బాగుంది చిన్ని ఆశ గారూ!
      మీరు నా కవితని మెచ్చినందుకు,
      మీరు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు...
      నా బ్లాగ్ మిత్రులలో...తండ్రులయిన అందరికీ...
      మీ వ్యాఖ్యకి చేసే ప్రతిస్పందనలోనే
      శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను....
      @శ్రీ

      Delete
  10. శ్రీ గారు,
    చాలా చాలా చాలా చాలా బాగా రాసారు అండీ....!!
    మీకు happy fathers day ...:):):)

    చిన్ని ఆశ గారి విశ్లేషణ బాగుంది......!!

    -- సీత.....

    ReplyDelete
    Replies
    1. అమ్మో సీతగారూ!
      అన్ని "చాలా"లు పెట్టేసారు...:-))
      కవిత మీకు నచ్చినందుకు బో........లెడు ధన్యవాదాలు... :-)
      @శ్రీ

      Delete
  11. బాగుంది శ్రీ గారు ....కృష్ణప్రియ

    ReplyDelete
    Replies
    1. కవిత మీరు మెచ్చినందుకు
      ధన్యవాదాలు కృష్ణ ప్రియా!
      @శ్రీ

      Delete
  12. Happy Father's day Sri gaaru. Late gaa wishes cheppanu.Sorry!
    kavita baagundi. chitraalu kooDaa baagunnaayi.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకి ధన్యవాదాలు వెన్నెలగారూ!
      మీ అభినందనలకి కూడా ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  13. హాయి శ్రీనివాస్,
    భావాల్ని అందరితో పంచుకుంటూ.....
    నీ బాధ్యతల్ని పెంచుకుంటున్నావ్ :-)
    మనల్ని ప్రేమించేవారు పెరుగుతున్న కొద్దీ...
    ఆ ప్రెమల్ని పదిలంగా చూసుకోడం బాద్యతే కదా!
    ఎప్పుడూ నిన్ను ఇలాగే సంతోషంగా చూడాలని కోరుకుంటున్న...
    నీ..
    బాల్య నేస్తం

    ReplyDelete
    Replies
    1. నా మిత్రుడిగా, నా శ్రేయోభిలాషిగా
      నా సంతోషం కోరుకుంటున్నందుకు
      నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను నేస్తం...
      నీవన్నది నిజమే...
      నాకిప్పుడు మంచి బ్లాగ్ మిత్రులు కూడా ఉన్నారు...
      ధన్యవాదాలు నీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  14. కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
    వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
    ఆ కొబ్బరి నీళ్ళ తీపి...
    ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
    నాన్నను ఎప్పటికీ వదలం....
    చాలా గొప్ప పద ప్రయోగం..చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా పద ప్రయోగం మీకు నచ్చినందుకు
      ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
      @శ్రీ

      Delete
  15. చాలా బాగున్నాయి మీ కవితలు. మీ బ్లాగ్ నాకు నచింది.మంచి పాట కుడా

    ReplyDelete
    Replies
    1. నా కవితలు , నా బ్లాగ్ నచ్చినందుకు మీకు ధన్యవాదాలు 123 గారూ!
      మీపేరు తెలియదు కదండీ!:-)
      నా బ్లాగ్ కి స్వాగతం....మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ ఉండండి....:-)
      @శ్రీ

      Delete
  16. "పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారాన్ని పంచుకునే ప్రయత్నం కూడా చేయం..." Very True.

    ReplyDelete
    Replies
    1. ఫణి గారూ!
      నా భావం మీకు నిజమనిపించిది కదూ!
      ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళముందే కనపడుతూ ఉంటాయండీ మనకు...
      ధన్యవాదాలు...
      అన్నట్లు మీ ఇంటి పేరుతొ మాకు చాలామంది చుట్టాలు ఉన్నారండీ...
      అందుకే మిమ్మల్ని క్రిందటి సారి మీ వివరాలడిగాను..
      ప్రొఫైల్ లో నా మెయిల్ ఐ డీ ఉంది...
      మీకు అభ్యంతరం లేకపోతె మీ వివరాలు తెలియ జేయ గలరు...
      @శ్రీ

      Delete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. మీ కవితలు ఇప్పుడే చూసాను
    చాలా బాగున్నాయి
    సుబ్రహ్మణ్యం,ఖరగపూర్

    ReplyDelete
  19. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ!...@శ్రీ

    ReplyDelete
  20. Wonderful tribute to a great and loving father.

    రత్నశిఖామణి

    ReplyDelete
  21. అమ్మ నాన్న లా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇ కవిత్వము లో కుడా అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది
    ధన్యవాదాలు సార్ మంచి అమ్మ నాన్న గురించి మనం ఎంత చెప్పిన రాశినా తక్కువే సార్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీకు.
      అవునండీ మీరన్నది నిజమే. 🙏😊

      Delete
  22. మీ కవిత చదువుతుంటే నా కంట్లో నీళ్ళు ఆగడంలేదు..
    ఇంతగా నా మనసును కదిలించి నందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్యవాదాలు🙏

      Delete
  23. మీ మాటలతో కళ్ళు చెమర్చాయి.. మీకు శతకోటి వందనాలు..

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్యవాదాలు... 🙏😊

      Delete