04/09/2012

తస్మైశ్రీ గురవే నమః



అమ్మలా  లాలించావు 
నాన్నలా బుజ్జగించావు...
ఓనమాలు నేర్పించావు... 
అక్షరాలు దిద్దించావు..

మా  అల్లరిని  భరించావు...
మా  తుంటరితనాన్ని తట్టుకున్నావు...
సున్నితంగా మందలించావు...
బెత్తంతో బెదిరించావు...

తెలుగా? ఆంగ్లమా? అని భేదం లేదు...
విజ్ఞానమా? భూగోళమా? అని తేడా లేదు...
అన్నీ నీకు కొట్టిన పిండి...
నీతి కథలు చెప్పడంలో విదురుడివి..
లెక్కల చిక్కులు విప్పడంలో నేర్పరివి...
చిత్రలేఖనంలో నిపుణుడివి..

నాలో విద్యను మలిచిన  అక్షర శిల్పివి. 
సకల విద్యా స్త్రాలను  ప్రసాదించిన విశ్వామిత్రుడివి.
లక్ష్యసాధనలో  వెన్ను తట్టిన ద్రోణుడివి.

నిరక్షరుల పాలిటి 'అక్షరశ్రీ' నీవు.
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలిన  'జ్ఞానజ్యోతి'వి నీవు.
అంతే కాదు...
మానుషరూపం దాల్చిన 'వాణీతేజమే' నీవు.




(సెప్టెంబరు 5 - ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నా గురువులకు 
 అక్షర నివాళి....ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మిత్రులందరికీ శుభాకాంక్షలు )

31 comments:

  1. Replies
    1. భాస్కర్ గారూ!
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      @శ్రీ

      Delete
  2. పదవ తరగతిలో నాకు త్రికోణమితి బోధించిన మీరు కూడా గురుపూజ్యులు మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ...................కృష్ణ ఆర్ వి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణా!
      ఉపాధ్యాయులు క్రిష్ణకి గురుపూజోత్సవ శుభాభినందనలు.
      @శ్రీ

      Delete
  3. ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ!
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      @శ్రీ

      Delete
  4. గురువా కృష్ణుడు జగతికి
    గురువా వ్యాసుండు , సాయి గురుడై నిలిచెన్
    గురువా రాథాకృష్ణుడు
    గురు పూజోత్సవము నేడు గురువుల దలతున్ .

    బ్రహ్మ విష్ణు మాహేశ్వర పరమ పూజ్య
    భావ మందున్న గురువుల పరువు నేడు
    పాఠశాలలు వీడి ఏపగిది చెడెనొ
    చూచు చున్నాము - ఇంకేమి చూడ నగునొ
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies

    1. అవును గురువు గారూ!
      మీరు పడే వేదన సరైనదే...
      అప్పటికీ-ఇప్పటికీ
      ఉపాధ్యాయుల్లోనూ
      విద్యార్ధుల్లోనూ చాలా మార్పు వచ్చింది...
      ఇప్పుడు కూడా ఉన్న సద్గురువులకి అభినందనలు అందిద్దాం..
      మీకు గురు పూజోత్సవాభివందనాలు...
      @శ్రీ

      Delete
  5. జ్ఞానాన్నొసగిన ప్రతిఒక్కరినీ గురువుగానెంచి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. అవును పద్మ గారూ!
      మనలో జ్ఞాన జ్యోతి వెలిగించిన అందరూ గురుతుల్యులే...
      వారికి శుభాభినందనలు చెప్పడం సమంజసమే..
      @శ్రీ

      Delete
  6. సర్, మీకు ఉపాద్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
    మీరు సమర్పించిన అక్షర సుమాంజలులు మీ గురువర్యులకు చేరుతాయి.
    గురువులను స్మరించిన మీ సంస్కారం గొప్పది...మెరాజ్.

    ReplyDelete
    Replies
    1. మెరాజ్ గారూ!
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      మీరన్నట్లుగా.....
      నా అక్షర సుమాంజలి వారికి చేరి
      వారి ఆశీస్సులు ఎప్పుడూ లభించాలనే నా అభిలాష కూడా...
      మీ స్నేహపూర్వకమైన స్పందనకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  7. శ్రీ గారు, మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పద్మార్పిత గారన్నట్టు జ్నానాన్నోసగిన ప్రతిఒక్కరు గురువులే. అందరికీ శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ!
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      మీరన్నది నిజమే...
      మీ స్నేహపూర్వకమైన స్పందనకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  8. శ్రీ గారూ మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలండీ..

    ReplyDelete
    Replies
    1. సుభ గారూ!
      నా బ్లాగ్ కి స్వాగతం...
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      @శ్రీ

      Delete
  9. శ్రీ గారు..
    మహోన్నతులైన గురువర్యులకు మీరందించిన
    అక్షరనివాళి చాలా బాగుందండీ..
    మీకు కూడా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ...

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ!
      మీ ఆత్మీయమైన ప్రశంసకి చాలా ధన్యవాదాలు...
      మీకు కూడా గురు పూజోత్సవ శుభాభినందనలు...
      @శ్రీ

      Delete
  10. టపా, దానికి తగ్గ పాట బాగున్నాయి శ్రీ గారు!
    గురుపూజోత్సవ శుభాకాంక్షలు !

    ReplyDelete
    Replies
    1. 'హర్షవీక్షణం'
      మొదలైన దగ్గర్నుంచీ
      'బ్లాగు వీక్షణం'తగ్గిపోయినట్లుంది హర్షా!
      ఈ మధ్య ఎక్కడా కనిపించటం లేదు...:-))
      విద్యాభ్యాసం అవుతోంది కనుక.. విద్యాభివృద్ధిరస్తు...:-)
      కవిత నచ్చినందుకు..పాట మెచ్చినందుకు...
      ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  11. దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులైన గురువులందరికీ అనేక ప్రమాణాలు. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
      మీరన్నది నిజం ..
      దేశ భవితకు పునాదులు వేసేది గురువులే...
      మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు...
      @శ్రీ

      Delete
  12. గురువులను కీర్తిస్తూ వేసిన పాట ( శ్లోకం ) , వ్రాసిన అభిప్రాయాలు అన్నీ చక్కగా ఉన్నాయండి.

    ReplyDelete
  13. నా భావాలు నచ్చినందుకు
    ధన్యవాదాలు anrd గారూ!..
    మీ పేరు anrd అంటే ఏమిటో తెలియక
    ఇలాగే సంబోధిస్తున్నాను...
    ఈ సారి మీ పేరు వ్రాస్తారు కదూ!..:-)
    @శ్రీ

    ReplyDelete
  14. చాలా బాగా రాసారు శ్రీ గారు. ఆలశ్యంగా స్పందిస్తున్నాను. ఏమీ అనుకోకండి.

    ReplyDelete
    Replies
    1. చాలా ధన్యవాదాలు వెన్నెల గారూ!
      మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete
  15. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలిన 'జ్ఞానజ్యోతి'వి నీవు.
    మంచి పద ప్రయోగం .మీ కవిత చాలా ఆనందం కలిగించింది.మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నేను వ్రాసిన కవితలోని కొత్తదనం ఏమున్నా
      దానిని ప్రశంసిస్తూ...
      ప్రోత్సహించే మీకు ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
      మీ అభినందనలకు కృతజ్ఞుడిని...
      @శ్రీ

      Delete
  16. రియల్లి రియల్లి గ్రేట్ శ్రీ గారు ...................మాటలు లేవు ......................గూరుభ్యో నమః ___/\___

    ఇలాగే మంచి మంచి కవితలు రాస్తూ ఆ గురు కాటాక్షం పొందాలని కోరుతూ.......

    ReplyDelete
  17. గురుపూజోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  18. కవిత చాలా బాగుంది

    ReplyDelete