తమస్సులో,ఉషస్సులో
నీకోసం వేచి చూసాను చెలీ!
నా కోసం,నీకోసం,
మనకోసం,
వస్తావని వేచి చూసాను చెలీ!
బంధాలు,అనుబంధాలు
తెంచుకొని
చేసిన బాస కోసం వస్తావని
వేచి చూసాను చెలీ!
బంధాలు, అనుబంధాలు
తెంచేసుకున్నావు నాతో....
నీ కాలికి పాశమైన నా ప్రేమ సంకెళ్ళనే
తెంచేసుకున్నావు చెలీ!....
నీ కాలికి పాశమైన నా ప్రేమ సంకెళ్ళనే
తెంచేసుకున్నావు చెలీ!....