03/03/2012

ఋతు రాగం




వసంతంలో నీకు వినిపించే
కోకిల మధుర గానంలో....
గ్రీష్మంలో చురుక్కుమనిపించే
బాలభానుని తొలికిరణంలో...


వర్షఋతువులో  నిను తాకి 
ఆవిరయ్యే తొలకరి జల్లులో...
శరత్తులో నిన్ను చూసి 
పరవశించే పున్నమి వెన్నెలలో...
నీ కంటి కాంతులకు మెరిసే 
హేమంతపు హిమబిందువులలో...
శిశిరంలో నీకు వినిపించే
ఎండుటాకుల గలగలలో.....
నా ప్రేమ పలకరింపులుంటాయి  ప్రియా!
నా ప్రేమ  పలకరింపులుంటాయి ప్రియా!


నేను నువ్వైపోయిన నీకోసం




ఓ ప్రణయ పవనమా!
మధుర స్వప్నమా!
మౌన రాగమా!
మనోహర రూపమా!

నా తనువై...అణువణువై...
నా కణ కణాలలో
నేనే నువ్వై ,
నువ్వే నేనై...
నిండిపోతే ఎలా?
ఉండిపోతే ఎలా?

సిగ్గుతెరల మాటునుండి
బైటికి వచ్చి... 
నీ ప్రేమని ఒప్పుకొనేదెలా?
ఈ విరహ తిమిరం నుంచి...
నేను తప్పుకునేదెలా?









మానస వీణ





నా మానస వీణను నీ ప్రేమతో శృతి చేసావు...
అదే శృతిలో నాలో ప్రేమ రాగాలు పలికించావు..
నీ ప్రేమ సంగీతం వినిపించావు.

ఇంతలోనే ..
ఆ వీణ తీగల్ని నిర్దాక్షిణ్యంగా తెంపి,
ప్రేమ సరిగమలను అపస్వరాలుగా మార్చి...
వెళ్లి పోయావు....

నా మానసవీణ
మూగబోయింది..
ఆ అపస్వరాలను పలికించలేక.
మళ్ళీ ఆ వీణ ప్రేమసంగీతం పలికే దెపుడో???
మళ్ళీ ఆ వీణ ప్రేమసంగీతం పలికే దెపుడో ???

నీ మనసున నా తలపులు



ప్రియా!
వసంతం వచ్చేసింది...
మదనుడు
తన శృంగార రథపు అశ్వాలను..
నీ జడకొరడాతో  అదిలిస్తూ తరలి వస్తున్నాడు.

చెరకు వింటిని ఎక్కుబెట్టి 
నన్నే లక్ష్యంగా చేసుకొని
కుసుమశరాలను
గురి తప్పకుండా
వదులుతున్నాడు.

అనుక్షణం నీ తలపులతో జీవించే 
నాతో వైరం ఎందుకని
ప్రశ్నించాను.

దూరంగా ఉన్న 
నీ మదిలోని 
నా వలపు తలపులే....
తన శరములని బదులిచ్చాడు.
నీ మదిలోని
నా వలపు తలపులే.....
తన శరములని బదులిచ్చాడు.