నీ ప్రేమతో ఉండమంటావ్..
నా ప్రేమే నువ్వంటాను....
నీతో ఉండమంటావ్...
నాలోనే నువ్వున్నావంటాను....
నీ మనసులో ఉండమంటావ్....
నా మనసే నువ్వంటాను....
నీ ప్రాణంలా చూసుకుంటానంటావ్...
నా ప్రాణమే నువ్వంటాను....
నీ నవ్వుల్లో నన్నుండమంటావ్...
నా నవ్వుకి కారణం నువ్వంటాను...
నీ కోసం జీవించమంటావ్...
నా జీవితమే నువ్వంటాను....
నీలో సగం నేనంటావ్...
నాలో 'నాకు' చోటు లేదంటాను....
ఇన్ని భిన్నాభిప్రాయాలున్న
మనం కలిసి ఉండటం చిత్రమే కదూ!!!!!!!