ఓ మనసు మరో మనసునడిగింది....
నా మనసున నీవున్నట్లుగా
నీ మనసులో నేనున్నానా?అని...
ఓ చేయి మరో చేతినడిగింది...
నా చేయి నీకందిస్తే,
నీ చేయి నాకందిస్తావా?అని...
ఓ గుండె మరో గుండెనడిగింది...
నా గుండె చప్పుడు
నీ గుండెల్లో వినిపిస్తోందా?అని...
ఓ ప్రేమ మరో ప్రేమనడిగింది...
నేను నిన్ను ప్రేమించినంతగా
నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా?అని...
నా చేయి నీకందిస్తే,
నీ చేయి నాకందిస్తావా?అని...
ఓ పదయుగ్మం మరో పాదాల జంటనడిగింది...
నేను నడిచే దారిలో
జీవితాంతం నడుస్తావా?అని...ఓ గుండె మరో గుండెనడిగింది...
నా గుండె చప్పుడు
నీ గుండెల్లో వినిపిస్తోందా?అని...
ఓ ప్రేమ మరో ప్రేమనడిగింది...
నేను నిన్ను ప్రేమించినంతగా
నీవు కూడా నన్ను ప్రేమిస్తున్నావా?అని...
ఓ ఎఱ్ఱబడిన కనుదోయి...
మరొక ఎఱ్ఱని కన్నుల జంటని...
అమాయకంగా అడుగుతోంది..
నాలాగే నువ్వు కూడా రాత్రంతా నిదురపోలేదా?అని...