సప్త ఋషుల సంతతి....
లోకాన జన సంద్రం
సప్త సముద్రాల మయం...
మన భూగోళం.
మన భూగోళం.
సప్త వర్ణాల అపురూప దృశ్యం...
ఒక ఇంద్రచాపం.
సప్తాశ్వాల రథ సారథి ఆగమనం...
తూరుపు దిక్కున అరుణం.
ఒక ఇంద్రచాపం.
సప్తాశ్వాల రథ సారథి ఆగమనం...
తూరుపు దిక్కున అరుణం.
సప్త స్వరాల సమ్మేళనం...
సుమధుర సంగీతం.
సుమధుర సంగీతం.
సప్త తంత్రులపై నీ ప్రేమ విన్యాసం...
నా మానసవీణా వాదనం.
సప్త పదాల గమనం...
నీతో గడిపే అందమైన జీవితం,
ఎన్నటికీ వాడని దివ్య కుసుమం,
ఏ జన్మకీ మరువలేని మధుర స్వప్నం......